న్యూఢిల్లీ, జూన్ 27: గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంతూర్ బ్రాండ్ విలువ రూ.2,300 కోట్లని విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్(డబ్ల్యూసీసీఎల్) సీఈవో వినీత్ అగర్వాల్ తెలిపారు. ఎఫ్ఎంసీజీ, లైటింగ్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ మొత్తం టర్నోవర్ రూ.8,634 కోట్లుగా ఉన్నదని, వీటిలో సంతూర్ సబ్బుల బ్రాండ్ రూ.2,300 కోట్లని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో ఆందోళన వ్యక్తంచేసిన సంస్థ..పామాయిల్, క్రూడాయిల్ ధరలు దిగివస్తుండటం కలిసొచ్చే అంశాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో ఈ బ్రాండ్ అగ్రగామిగా ఉన్నదని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 16 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు.