న్యూఢిల్లీ, జూన్ 18: పాదరక్షల తయా రీ దిగ్గజం బాటా ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈవోగా సంజయ్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గుంజన్ షా స్థానంలో సంజయ్ వస్తున్నారు. ఐదేండ్ల పదవీకాలం ముగియడంతో షా దిగిపోతున్నారు. ఇదిలావుంటే నైక్ నుంచి బాటలోకి సంజయ్ వచ్చారు. భారత్‌తోపాటు దక్షిణాసియా, చైనా, యూరప్‌ల వ్యాప్తంగా రిటైల్, కన్జ్యూమర్ లీడర్‌షిప్‌లలో 2 దశాబ్దాలకుపైగా అనుభవం ఆయనకున్నది.