Back To Office | ఉద్యోగులను వెల్కం పార్టీలతో ఆహ్వానిస్తున్న కంపెనీలు!
కరోనా మహమ్మారి వెంటాడటంతో రెండేండ్ల పాటు ఇంటి నుంచి పనిచేసిన ఉద్యోగులు క్రమంగా తిరిగి కార్యాలయాల బాట పడుతున్నారు.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడటంతో రెండేండ్ల పాటు ఇంటి నుంచి పనిచేసిన ఉద్యోగులు క్రమంగా తిరిగి కార్యాలయాల బాట పడుతున్నారు. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతుండటంతో వర్క్ ఫ్రం ఆఫీస్‌కు ఉద్యోగులు అలవాటు పడుతున్నారు. శాంసంగ్, మింత్ర, గార్టనర్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తూ గ్రాండ్ వెల్కం పార్టీలను ఏర్పాటు చేస్తున్నాయి.
ఆఫీసులను మళ్లీ తెరిచేందుకు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నాయి. గార్ట్నర్ ఇటీవల తమ ఉద్యోగుల కోసం రీఓపెనింగ్ సెర్మనీలను నిర్వహించింది. పలు కంపెనీలు జులై-సెప్టెంబర్ క్వార్టర్లో ఇలాంటి వేడుకలు నిర్వహించనున్నాయి. మరోవైపు ప్రాపర్టీ కంపెనీలకు చెందిన 50-60 శాతం మంది ఉద్యోగులు తిరిగి కార్యాలయాల నుంచి పనిచేస్తుండగా మిగిలిన వారు హైబ్రిడ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ మింత్ర ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగళూర్‌లోని మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన భవనంలోకి మారింది.
ఉద్యోగులు ఆడుతూపాడుతూ పనిచేసే వాతావరణం కల్పిస్తూ వారిని కార్యాలయాలకు రప్పించేలా చర్యలు చేపడుతున్నట్టు మింత్ర పేర్కొంది. కార్యాలయాలను కేవలం పని ప్రదేశంలా కాకుండా ఉద్యోగుల్లో సృజనాత్మకత పెంపొందిస్తూ వారు సేదతీరేందుకు, ఆహ్లాదంలా గడిపే వాతావరణం ఉండేలా కార్పొరేట్ కంపెనీలు చొరవ చూపుతున్నాయి వర్క్‌స్పేస్ డిజైన్ సంస్ధ స్పేస్ మ్యాట్రిక్స్ సీఈవో అక్షయ్ లఖన్‌పాల్ చెప్పుకొచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

