సామ్సంగ్ జెడ్8 సిరీస్ ఫోన్లు.. రూ.1.25-2.60 లక్షల శ్రేణిలో ధరలు
భారత్‌లో తయారైన సామ్సంగ్ జెడ్8 ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చే నెలలో దేశీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రీమియం ఫోన్లను ఆగస్టు 7 నుంచి స్టోర్లలో అమ్మకానికి పెట్టనున్నారు. స్టోరేజీ సామర్థ్యాన్నిబట్టి ధరల శ్రేణి రూ.1.25 లక్షల నుంచి 2.60 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది.
- ఆగస్టు 7నుంచి దేశీయ మార్కెట్లో లభ్యం
- మొదలైన ముందస్తు బుకింగ్‌లు
లండన్, జూలై 22 : భారత్‌లో తయారైన సామ్సంగ్ జెడ్8 ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చే నెలలో దేశీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రీమియం ఫోన్లను ఆగస్టు 7 నుంచి స్టోర్లలో అమ్మకానికి పెట్టనున్నారు. స్టోరేజీ సామర్థ్యాన్నిబట్టి ధరల శ్రేణి రూ.1.25 లక్షల నుంచి 2.60 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది.
కాగా, లండన్‌లో ఈ గెలాక్సీ జెడ్8 సిరీస్ ఫోన్లను సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ బుధవారం ఆవిష్కరించింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా, జెడ్ ఫోల్డ్8, జెడ్ ఫ్లిప్8 మాడళ్లలో వీటిని తీసుకొచ్చారు. భారత్‌లోనూ ఇక ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ నైరుతి ఆసియా అధ్యక్షుడు జేబీ పార్క్ ప్రకటించారు.
- గ్రాఫైట్, క్రీమ్, వాయ్‌లెట్ షాడో, గ్రీన్ షాడో కలర్లలో జెడ్ ఫోల్డ్8 అల్ట్రా లభిస్తుంది. ధర రూ.2 లక్షలు, 2.20 లక్షలు, 2.60 లక్షలు.
- గ్రాఫైట్, క్రీమ్, లావెండర్, పిస్తాచియో కలర్ ఆప్షన్లలో జడ్ ఫోల్డ్8 దొరుకుతుంది. ధర రూ.1.80 లక్షలు, 2 లక్షలు, 2.40 లక్షలు.
- గ్రాఫైట్, క్రీమ్ పింక్, మింట్ రంగుల్లో జెడ్ ఫ్లిప్8 ఉంటుంది. ధర రూ.1.25 లక్షలు, 1.45 లక్షలు.
- సన్నగా, తేలిగ్గా, పెద్ద స్క్రీన్ డిస్ప్లేలు, సమర్థవంతమైన బ్యాటరీ.
- జీరో డౌన్ పేమెంట్‌తో 30 నెలలపాటు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం.
- రూ.10,000దాకా అప్‌గ్రేడ్ ఆఫర్ లేదా రూ.9,000 వరకు బ్యాంక్/యూపీఐ క్యాష్ బ్యాక్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

