Samsung Galaxy M55s 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ (Samsung Galaxy M55s 5G) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతోపాటు స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ సెట్ తో వస్తోంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. డ్యుయల్ టెక్చర్ ఫినిష్ కోసం రేర్ ప్యానెల్ మీద ఫుషన్ డిజైన్ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ (Samsung Galaxy M55s 5G) ఫోన్ రూ.19,999లకు లభిస్తుంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్, సెలెక్టెడ్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ నెల 26 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ (Samsung Galaxy M55s 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎస్ అమోలెడ్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్ పై పని చేస్తుంది. వర్చువల్ రామ్‌తోపాటు 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీతో వస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ (Samsung Galaxy M55s 5G) ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఒకేసారి బ్యాక్, ఫ్రంట్ కెమెరాలతో ఫోటోలు, వీడియోల రికార్డింగ్ చేయొచ్చు. 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటది.