Samsung Galaxy M14 5G |దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G) ఫోన్ వచ్చేవారం ఆవిష్కరించనున్నది. 5ఎన్ఎం ఎక్స్‌నోస్ 1330 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తోపాటు మూడు రంగుల్లో వస్తున్నది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్.. సింగిల్ చార్జింగ్‌తో రెండు రోజుల వరకు వినియోగించవచ్చు. ఈ నెల 17 మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ.13 వేల పైచిలుకు ఉండవచ్చునని శాంసంగ్ తెలిపింది. లాంచింగ్ నాడే ధర, ఇతర ఫీచర్లు, వివరాలు వెల్లడి కానున్నాయి.
5ఎన్ఎం ఎక్స్‌నోస్ 1330 ఎస్వోసీ చిప్సెట్.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో ట్రిపుల్ కెమెరా.
13-మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫర్ సెల్ఫీ.
6000-ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
సింగిల్ చార్జితో రెండు రోజుల వరకు వినియోగించుకోవచ్చు.
6.6-అంగుళాల ఫుల్ హెచ్+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే.
ఆండ్రాయిడ్-13 బేస్డ్ వన్ యూఐ వర్షన్‌తో పని చేస్తుంది.
4జీబీరామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, డ్యుయల్ 2-మెగా పిక్సెల్ సెన్సర్స్ ఫర్ డెప్త్ అండ్ మాక్రో మోడ్.
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫర్ అథంటికేషన్.