Samsung Galaxy F55 5G | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) ఫోన్ను ఈ నెల 17న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ సీ55 5జీ ఫోన్ను రీ బ్రాండ్ చేసి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ను ఆవిష్కరిస్తున్నారని తెలుస్తున్నది. గత నెలలోనే చైనాలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ను ఆవిష్కరించారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్ తో వస్తోందీ ఫోన్.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ సేల్స్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్, శాంసంగ్ వెబ్ సైట్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో జరుగుతాయి. మూడు వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999లకు లభిస్తాయి. ఈ ఫోన్ అప్రికోట్ క్రష్, రైజిన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 1080×2400 పిక్సెల్ రిజొల్యూషన్తోపాటు 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. సన్ లైట్లోనూ తేలిగ్గా వినియోగించేందుకు వీలుగా 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్ ఉంటుంది. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్.