Samsung Galaxy F54 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ త్వరలో భారత్ మార్కెట్లో గెలాక్సీ ఎఫ్54 5జీ (Samsung Galaxy F54 5G) ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ ఒక్టాకోర్ ఎక్సినోస్ ఎస్వోసీ చిప్సెట్, 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో రూపుదిద్దుకున్నది. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి తెచ్చిన గెలాక్సీ ఎం54 5జీ ఫోన్ స్థానంలో గెలాక్సీ ఎఫ్54 5జీ వస్తుందని సమాచారం. ఈ ఫోన్ డార్క్‌బ్లూ, సిల్వర్ కలర్ విత్ గ్రాడియెంట్ ఫినిష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని చెబుతున్నారు. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. వీటితోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కూడా జత చేస్తారు.
రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి. కెమెరాల్లో ఆప్టిమైజ్డ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), నైటోగ్రఫీ, ఆస్ట్రో లాప్స్ ఫీచర్లు జత చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్ 6.7-అంగుళాల 120హెర్ట్జ్ ఫుల్ -హెచ్డీ + (2400 x 1080 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ ఆప్షన్‌తో వస్తున్నది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ ఎక్సినోస్ 1380 5జీ చిప్సెట్, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్స్ విత్ 25వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది. హైబ్రీడ్ స్లాట్ , వై-ఫై6 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్ ధర రూ.33 వేల నుంచి మొదలవుతుందని సమాచారం. 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ గల హై ఎండ్ ఫోన్ ధర రూ.35,999 ఉండొచ్చు. ఈ ఫోన్ 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లో కూడా వస్తుందని తెలుస్తున్నది.