Samsung Galaxy F36 5G: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం సామ్సంగ్ (Samsung).. మరో కొత్త మొబైల్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నది. ఎఫ్ సిరీస్‌లో అత్యాధునిక ఏఐ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్‌ను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. 2023లో అందుబాటులోకి తీసుకొచ్చిన గెలాక్సీ ఎఫ్34 5జీకి కొనసాగింపుగా గెలాక్సీ ఎఫ్36 5జీ (Samsung Galaxy F36 5G) Hi-FAI ఫోన్‌ను లాంచ్ చేస్తున్నది.
గెలాక్సీ ఎఫ్34 మోడల్‌ను రూ.18,999లకు విడుదల చేసిన నేపథ్యంలో ఈ సరికొత్త ఎఫ్36 కూడా రూ.20,000 లోపే ఉండనుంది. దీంతో ప్రీమియం డిజైన్‌తో వస్తున్న ఈ మోడల్ చౌకైన 5G ఫోన్లలో ఒకటిగా మారనుంది. ఈ ఫోన్ 4GB+128జీబీ, 6GB+128జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో వస్తున్నది. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్, క్రిమ్సన్ రెడ్ అనే మూడు రంగుల్లో ఉండనుంది. శాంసంగ్ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. లాంచ్ ఆఫర్లలో బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి.
ఫీచర్స్..
సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్36 5Gలో 6.46 అంగుళాల FHD + PLS LCD డిస్ప్లే ఉంది. ఇందులో120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో వినియోగదారులు మృదువైన స్క్రోలింగ్, గొప్ప వీక్షణ అనుభవాన్ని పొందవచ్చు. ఈ ఫోన్లో సామ్సంగ్ ఇన్-హౌస్ ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ఉంది. ఇది శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. అదేవిధంగా మల్టీ టాస్కింగ్‌ను సులభతరం చేస్తుంది.
ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా, 2ఎంపీ మాక్రో కెమెరాలతో ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 13ఎంపీ కెమెరా ఇచ్చారు. 1280 సామ్సంగ్ గ్జైనోస్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ ఆడ్రాయిడ్ 13 ఓఎస్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.