Samsung Galaxy-Discounts | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ పలు స్మార్ట్ ఫోన్ల ధరలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. గత అక్టోబర్‌లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్ తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ఫోన్లపై ధర తగ్గిస్తున్నట్లు అధికారికంగా తన వెబ్సైట్లో ప్రకటించింది. వీటితోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04, శాంసంగ్ గెలాక్సీ ఎ04 ఫోన్లు కూడా డిస్కౌంట్‌పై లభిస్తాయి.
ఈ నెల 11 నుంచి శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్ మీద రూ.2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గత అక్టోబర్‌లో మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభించింది. అటుపై 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ఫోన్లు డిస్కౌంట్ ధరపై రూ.11,999, రూ.12,999లకు సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం14 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,490 నుంచి రూ.12,490, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,990 నుంచి రూ.13,990లకు తగ్గించారు.
మరోవైపు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ రూ.12,990 నుంచి రూ.11,990, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,490 నుంచి రూ.13,490లకు తగ్గించారు. వీటిపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తున్నది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 – శాంసంగ్ గెలాక్సీ ఎం04 ఫోన్లు రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు.