Samsung | ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. శాంసంగ్ కీలక నిర్ణయం.. బోర్డు సభ్యుల వేతన పెంపుపై ఆంక్షలు.. ఉద్యోగులకు ఇలా!
Samsung | ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బోర్డు సభ్యుల వేతనాలపై పెంపు నిలిపేసింది శాంసంగ్. ఉద్యోగులకు సగటున 4.1 శాతం వేతనం పెంచేందుకు అంగీకారం కుదిరింది. గతేడాది 9 శాతం వేతనాలు పెంచడం గమనార్హం.
Samsung | ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు.. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్‌ను కూడా తాకాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో కీలకమైన చిప్‌ల సరఫరా అద్వాన్నంగా మారడంతోపాటు ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు సగటున 4.1 శాతం మాత్రమే పెంచుతున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. పనితీరు వైఫల్యం వల్ల బోర్డు సభ్యుల వేతనాల పెంపు పరిమితి విధించింది.
శాంసంగ్‌లో గతేడాది ఉద్యోగుల వేతనాలు తొమ్మిది శాతం పెరిగాయి. అంతే కాదు గత దశాబ్ది కాలంలోనే ఇది గరిష్టం. ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలన్న డిమాండ్ కంటే తక్కువగా శాంసంగ్ సగటున ఉద్యోగుల వేతనాలు 4.1 శాతం పెంచేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఉద్యోగుల వేతనాల పెంపు, ఇతర కార్మిక విధానాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒప్పందం కుదిరింది. మహిళా ఉద్యోగుల్లో గర్భవతుల పని గంటల తగ్గింపు విధానాన్ని కొనసాగిస్తూ నిర్ణయం కుదిరింది.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సంస్థ లాభాలు 96 శాతం తగ్గిపోవడంతో వేతనాల పెంపు, ఇతర విధానాలపై ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. బోర్డు సభ్యులకు గతేడాది వేతన ప్యాకేజీ విధానం అమలు చేయాలని శాంసంగ్ నిర్ణయించింది. గరిష్టంగా 17 శాతం వేతనం మాత్రమే పెంచాలని పరిమితి విధించింది. శాంసంగ్‌లో పని చేస్తున్న 1.10 లక్షల మందిలో నాలుగు శాతం మంది యూనియన్ సభ్యులుగా ఉన్నారు. వారి వేతన పెంపు ఒప్పందంపై గతేడాది నుంచి సంప్రదింపులు జరిపినా విభేదాలు పరిష్కారం కాలేదు.
చిప్‌ల కొరత వల్ల తొలి త్రైమాసికం లాభాలు 96 శాతం పతనమైన నేపథ్యంలో స్వల్పకాలికంగా చిప్‌ల తయారీ లక్ష్యాలు కుదించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మెమొరీ చిప్, స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన శాంసంగ్.. జనవరి-మార్చి మధ్య కేవలం 454.9 (600 బిలియన్ వూన్లు) మిలియన్ డాలర్ల నిర్వహణ లాభాలు గడించింది. ఏడాది క్రితం 14.12 లక్షల కోట్ల వూన్ల నిర్వహణ లాభం గడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

