న్యూఢిల్లీ, మే 16: దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ రెండు సరికొత్త అధిక సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్స్‌ను విడుదల చేసింది. 45వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 20,000 మెగాహెట్జ్ శ్రేణిలో ఒకటి, 25వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 10,000 మెగాహెట్జ్ శ్రేణిలో మరొకదాన్ని పరిచయం చేసింది.
ఇందులో 20,000 మెగాహెట్జ్ బ్యాటరీ పవర్ బ్యాంక్ ధర రూ.4,299. 10,000 మెగాహెట్జ్ బ్యాటరీ పవర్ బ్యాంక్ ధర రూ.3,499. స్మార్ట్ఫోన్లేగాక హెడ్‌ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచీలు, వైర్లెస్ ఇయర్‌బడ్స్ వంటి వాటిని చార్జ్ చేసుకోవచ్చు.