హైదరాబాద్, అక్టోబర్ 11: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్‌కు చెందిన ఎస్యూవీ పంచ్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. తెలుగు రాష్ర్టాల్లో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ప్రస్తుత పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో పంచ్ రెండో స్థానంలో నిలిచింది. గత నెలలో దేశీయంగా అమ్ముడైన ఎస్‌యూవీల్లో టాటా పంచ్ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, సీఎన్జీ, ఈవీల్లో లభిస్తున్నది.
తొలి సారి కారును కొనుగోలు చేసేవారిలో 69 శాతం మంది ఈ కారుకు ఓటు వేశారు. తెలంగాణ వ్యాప్తంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో 21 శాతం పంచ్ వాటా ఉండగా, అలాగే ఏపీల్లో 25 శాతంగా ఉన్నది. 5-స్టార్ భద్రత రేటింగ్ ఇవ్వడంతో కొనుగోలుదారులకు ఫస్ట్ ఛాయిస్‌గా టాటా పంచ్ నిలిచింది.