న్యూఢిల్లీ, జూలై 9: భారత సంతతికి చెందిన వ్యక్తికి మరో కీలక పదవి వరించింది. యాపిల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి(సీవోవో)గా సబిహ్ ఖాన్ నియమితులయ్యారు. 58 ఏండ్ల వయస్సు కలిగిన ఖాన్..30 ఏండ్ల క్రితం యాపిల్‌లో చేరారు. ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఖాన్‌ను..ఈ నెల చివర్లో పదవి విరమణ చేస్తున్న జెఫ్ విలియమ్స్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.
యాపిల్‌లో చేరకముందు ఆయన..జీపీ ప్లాస్టిక్‌లో అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంజినీర్, అకౌంట్ టెక్నికల్ అధికారిగా విధులు నిర్వహించారు. 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్‌లో జన్మించిన ఆయన..ఆ తర్వాత సింగపూర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యారు.