దేశీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పతనమవుతున్నది. గ్లోబల్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డి మాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 17 పైసలు తగ్గి 77.71 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీలు తగ్గడం, క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, విదేశీ పెట్టుబడులు తరలించుకుపోవడం మారకం పతనానికి పరోక్షంగా కారణం.