ముంబై, జూన్ 10: రూపాయి మళ్లీ బీటలుపడుతున్నాయి. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. దీంట్లోభాగంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు కోల్పోయి 83.50 వద్దకు జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో 83.48 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు చివరకు 83.50కి పడిపోయింది. గత వారం 13 పైసలు పెరిగింది.