జూబ్లీహిల్స్, జూలై 10: ఆర్ఎస్ బ్రదర్స్‌లో ఆషాఢమాసం కేజీ సేల్స్ ఆఫర్ వస్ర్తాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఆషాఢమాసం పురస్కరించుకుని అన్ని రకాల వస్ర్తాలపై 70 శాతం తగ్గింపు ధరలకు అందుబాటులో లభ్యమయ్యేలా కేజీ సేల్స్ ఆఫర్ అందిస్తున్నట్లు ఆర్ఎస్ బ్రదర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా రానున్న పర్వదినాలను, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకుని కంచి పట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పఠాని, పోచంపల్లి, పటోల, రాజ్‌కోట్, జైపూర్, కోల్‌కతా, బెనారస్, ఫ్యాన్సీ, డిజైనర్ శారీస్, క్యాటలాగ్ శారీస్, మెన్స్ ఎత్నిక్ వేర్, కిడ్స్ వేర్లలో విన్నూత్నమైన వస్ర్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆషాఢమాసం కేజీ సేల్స్‌పై వస్ర్తాభిమానులతో పాటు మహిళా లోకం విశేష ఆదరణతో ప్రతిరోజు సరికొత్త స్టాక్‌ను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. వినియోగదారుల సౌలభ్యం కోసం హెచ్డీఎఫ్సీ డెబిట్/క్రెడిట్ కార్డులపై ఈఎంఐ పద్దతిన కొనుగోలు సదుపాయం కల్పించడంతో పాటు రూ.5 వేల తక్షణ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు.