పూణె, జనవరి 19: బజాజ్ ఆటో నయా చేతక్ సీ25పై ప్రత్యేక తగ్గింపునిచ్చింది. తొలి పదివేల మందికి రూ.4,299 తగ్గింపుతో ఈ స్కూటర్‌ను అందిస్తున్నది.
తొలుత కొనుగోలుచేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నదని పేర్కొంది. 2.5 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 113 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఢిల్లీ షోరూంలో ఈ స్కూటర్ రూ.87,100కి లభించనున్నది.