రాయల్ ఎన్ఫీల్డ్ ఈవీ బైకు.. ప్రారంభ ధర రూ.2.79 లక్షలు
ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్..దేశీయ మార్కెట్లోకి తన తొలి ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లైయింగ్ పీ సీ6 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.2.79 లక్షలుగా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్..దేశీయ మార్కెట్లోకి తన తొలి ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లైయింగ్ పీ సీ6 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.2.79 లక్షలుగా నిర్ణయించింది. కానీ, బ్యాటరీ-యాస్-ఏ-సర్వీసెస్(బాస్) పద్దతిన తీసుకుంటే ఈ మోటర్‌సైకిల్ ధర మాత్రం రూ.1.99 లక్షలు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్పోర్ట్స్ బైకును విడుదల చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
3.91 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ బైకు బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 3.7 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ బైకు గంటకు 115 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. అలాగే 65 నిమిషాల్లోనే బ్యాటరీ 20 శాతం నుంచి 80 శాతం రీచార్జికానున్నది. ఈ బైకులో ఎల్ఈడీ లైటింగ్, గూగుల్ ఆధారంగా పనిచేసే నావిగేషన్, వైర్లెస్ ఫోన్ చార్జింగ్ సాకెట్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

