Royal Enfield Bikes | రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటేనే యువతలో క్రేజ్ ఉంటుంది. కంపెనీకి చెందిన పలు మోడల్ బైక్స్ ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే కంపెనీ పలు మోడల్స్ ధరలను పెంచింది. కంపెనీ నాలుగు మోడల్స్ ధర పెంచిందని సమాచారం. ఇందులో సూపర్ మీటోర్ 650, బుల్లెట్ 350, హంటర్ 350, స్క్రామ్ 411 మోడల్ బైక్లు ఉన్నాయి.
భారత మార్కెట్లో ఈ బైక్లకు చాలా డిమాండ్ ఉంది. ఓ నివేదిక ప్రకారం బుల్లెట్ 350 అన్ని వేరియంట్లపై ధరను సుమారు రూ.3వేల వరకు పెరిగింది. స్క్రామ్ 411 ధర రూ.3390 దాకా పెరిగింది. సూపర్ మీటోర్ 650 ఎక్స్ షోరూమ్ ధరలను రాయల్ ఎన్ఫీల్డ్ దాదాపు రూ.6వేల వరకు పెంచింది. కంపెనీ ధర పెంచిన తర్వాత బుల్లెట్ 350 ఎక్స్ షోరం ధర రూ.1.60లక్షలు. ఈ ధర బైక్ కిక్ స్టార్ట్ వేరియంట్.
ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.69 లక్షలు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ హంటర్ 350 ప్రారంభ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, పలు వేరియంట్లకు చెందిన ధరలను మాత్రం కంపెనీ పెంచింది. కంపెనీకి చెందిన ఖరీదైన బైకుల్లో ఒకటైన సూపర్ మీటోర్ 650 ధర కేవలం ఎక్స్ షోరూం ధరనే రూ.3.55 లక్షలు. ఈ ధర ఆస్ట్రల్ వేరియంట్ది కాగా.. ఇంటర్స్టెల్లార్ ధర రూ.3.70లక్షలు, సెలెస్టియల్ వేరియంట్ ధర రూ.3.85లక్షలకు పెరిగింది.