Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా.. బోరిస్ జాన్సన్ వారసుడిగా.. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్ ఎంపిక అవుతారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారిలో ఇద్దరు ప్రత్యర్థులను ఎన్నుకుంటారు. అసలు ప్రధాని అభ్యర్థిగా పోటీలో ఉండటానికి నిర్దిష్టంగా 20 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని పదవికి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి రౌండ్ ఓటింగ్లో రిషి సునాక్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
రిషి సునాక్కు తొలి రౌండ్లో 88 ఓట్లు లభించాయి. బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా రిషి సునాక్కు సహాయకుడిగా ఉన్న సహాయ వాణిజ్య మంత్రి పెన్నీ మొరౌంట్కు 67, విదేశాంగశాఖ మంత్రిగా పని చేసిన లిజ్ ట్రూస్కు 50 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక మంత్రి నధీమ్ జహావి, మాజీ మంత్రి జెరెమీ హంట్లను పోటీ నుంచి తప్పించారు. ఎంపీ కెమీ బేడ్నాక్ 40, టామ్ టుగెంధట్ 37, సౌల్లా బ్రేవర్మాన్ 32 ఓట్లు పొందారు.
తదుపరి రౌండ్లలో తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పిస్తారు. చివరకు అత్యధిక ఓట్లు వచ్చిన ఇద్దరు అభ్యర్థుల్లో తమకు నచ్చిన నేతను కన్జర్వేటివ్ పార్టీ నేతగా.. ప్రధానిగా.. అధికార పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటున్నారు. ఆ ఓట్లలో మెజారిటీ లభించిన వారే బ్రిటన్ ప్రధాని అవుతారు.
ప్రస్తుత దశలో జరుగుతున్న పోటీ ప్రకారం బ్రిటన్ ప్రధాని పదవికి త్రిముఖ పోటీ ఏర్పడనున్నది. రిసి సునాక్తోపాటు మోర్డౌంట్, ట్రస్ పోటీ పడనున్నారని తెలుస్తున్నది. గురువారం 358 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తమ ఫేవరెట్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ ముగ్గురు అభ్యర్థులతోపాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సౌల్లా బ్రేవర్మన్ పోటీలో ఉన్నారు. ప్రస్తుత ప్రధాని ఎన్నిక షెడ్యూల్ ప్రకారం బోరిస్ జాన్సన్ వారసుడిగా, తదుపరి బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ నేతను సెప్టెంబర్ 5 నాటికి ప్రకటిస్తారని సమాచారం.
ఇప్పటికి భారత సంతతి నేత రిషి సునాక్ లీడ్లో ఉన్నా.. కన్జర్వేటివ్ పార్టీ పునాది.. తమ నేతను నిర్ణయించనున్నది. దీని ప్రకారం పెన్నీ మౌర్డౌంట్.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.