జేఎస్పీఎల్తో ఆర్ఐఎన్ఎల్ దోస్తీ
ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ లేదా వైజాగ్ స్టీల్).. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్)తో జట్టు కట్టింది. వర్కింగ్ క్యాపిటల్ మద్దతు, ముడి సరకు సరఫరాకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ లేదా వైజాగ్ స్టీల్).. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్)తో జట్టు కట్టింది. వర్కింగ్ క్యాపిటల్ మద్దతు, ముడి సరకు సరఫరాకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు వివిధ ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అతుల్ భట్ తాజాగా ప్రకటించారు. నిలిచిపోయిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్ పునరుద్ధరణకు తమ ఈ ఒప్పందం దోహదపడగలదని వివరించారు. కాగా, 2021 జనవరిలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్ మూతబడింది. తాజా అగ్రిమెంట్ నేపథ్యంలో ఈ నెల 30న దీన్ని తిరిగి ప్రారంభించాలని సంస్థ చూస్తున్నది.
దీని హాట్ మెటల్ సామర్థ్యం నెలకు 2 లక్షల టన్నులని భట్ చెప్పారు. ఇక ఈ ఒప్పందం కింద అడ్వాన్స్ వర్కింగ్ క్యాపిటల్ రూపంలో లేదా మూడో బ్లాస్ట్ ఫర్నేస్ పునరుద్ధరణకు అవసరమైన ముడి సరకు కోసం రూ.800-900 కోట్లను ఆర్ఐఎన్ఎల్కు జేఎస్పీఎల్ అందించనున్నది. దీనికి బదులుగా ప్రతినెలా జేఎస్‌పీఎల్‌కు సుమారు 90వేల టన్నుల కాస్ట్ బ్లూమ్స్‌ను ఆర్ఐఎన్ఎల్ సరఫరా చేయనున్నది. ఒప్పందంతో సంస్థ నెలవారీ సేల్స్ టర్నోవర్ సుమారు రూ.500 కోట్లు పెరుగుతుందని, ఇది కంపెనీ నష్టాలను నెలకు రూ.50-100 కోట్లను తగ్గించగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా భట్ వెలిబుచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

