Revolt RV1 | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్.. దేశీయ మార్కెట్లో రివోల్ట్ ఆర్వీ1 (Revolt RV1) మోటారు సైకిల్ ఆవిష్కరించింది. రివోల్ట్ ఆర్వీ1 రెండు వేరియంట్లలో లభిస్తుంది. రివోల్ట్ ఆర్వీ1 ఈవీ మోటారు సైకిల్ రూ.84,990, రివోల్ట్ ఆర్వీ1+ మోటారు సైకిల్ రూ.99,990 పలకుతుంది. ఇంతకుముందు ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరించిన ఓలా రోడ్ స్టర్ఎక్స్ మోటారు సైకిల్ కు పోటీగా ‘రివోల్ట్ ఆర్వీ 1’ వస్తోంది.
రివోల్ట్ ఆర్వీ1 మోటారు సైకిల్ చైన్ డ్రైవ్ సిస్టమ్ తోపాటు రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. 2.2 కిలోవాట్ల బ్యాటరీ 100 కి.మీ దూరం, 3.24 కిలోవాట్ల బ్యాటరీ 160 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ఎల్ఈడీ హెడ్ లైట్స్, 6-అంగుళాల డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యుయల్ డిస్క్ బ్రేక్స్, మల్టిపుల్ స్పీడ్ మోడ్స్, రివర్స్ మోడ్, స్టేబుల్ రైడ్ కు వీలుగా వైడర్ టైర్లు ఉంటాయి.