Ola Scooter : ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
Ola Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో రివర్స్ గేర్‌ను అమర్చినట్లు సదరు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో స్కూటర్ రివర్స్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భావేష్ అగర్వాల్ కూడా రివర్స్‌లో రాసి ఆశ్చర్యంలో ముంచెత్తారు

ముంబై : మరో వారం రోజుల్లో మార్కెట్లోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Scooter) లో రివర్స్ గేర్‌ను అమర్చినట్లు సదరు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో స్కూటర్ రివర్స్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భావేష్ అగర్వాల్ కూడా రివర్స్‌లో రాసి ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఓలా కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్ట్ 15 న మార్కెట్లోకి విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నది. భారతీయ రోడ్లపై రివర్స్ గేర్ కలిగివున్న తొలి స్కూటర్ ఇదే కానున్నది. దీనికి సంబంధించిన 17 సెకండ్ల నిడివిగల వీడియోను కంపెనీ సీఈవో భావేష్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఆటో మార్కెట్లో సంచలనంగా మారింది. ‘లిజన్ టు మీ నౌ’ అనే ఇంగ్లిష్ అక్షరాలను రివర్స్‌లో రాసి పోస్ట్ చేయడంతో ఎంతో ఆకట్టుకుంటున్నది.
10 రంగుల్లో అందుబాటులోకి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రీ బుకింగ్ గత నెల 15 న ప్రారంభమైంది. కేవలం ఒక్క రోజులోనే లక్ష స్కూటర్లకు ఆర్డర్లు వచ్చాయి. దీని ధరను కంపెనీ ఇంతవరకు బయటకు చెప్పలేదు. అయితే, రూ.85,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీనిలో రెండు హెల్మెట్లు పెట్టుకునే సౌకర్యం ఉన్నది. కేవలం 18 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చనేవి ఈ స్కూటర్ ప్రత్యేకతలు. ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా దేశ వ్యాప్తంగా 400 పట్టణాల్లో లక్షకుపైగా ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటుచేశారు.
ఇవి కూడా చదవండి..
కుంభమేళాలో నకిలీ కొవిడ్ పరీక్షలు.. ఈడీ తనిఖీలు
హక్కులు-బాధ్యతల మధ్య సమన్వయం అవసరం: వెంకయ్య
జరాంజ్‌ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు
షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

