Income Tax Website | ఆకర్షణీయ ఫీచర్లతో యూజర్ ఫ్రెండ్లీగా ఇన్‌కం టాక్స్ పోర్టల్
Income Tax Website | ఆదాయం పన్ను చెల్లింపుదారులకు తేలిగ్గా అందుబాటులో ఉండేలా యూజర్ ఫ్రెండ్లీగా ఆకర్షణీయ ఫీచర్లతో కొత్త ఆదాయం పన్ను విభాగం వెబ్‌సైట్‌ను సీబీడీటీ శనివారం ప్రారంభించింది.
Income Tax Website | వేతన జీవులు.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు.. ప్రొఫెషనల్స్.. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతియేటా తమ ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడం చాలా తేలిక.. అందుకోసం ఆదాయం పన్ను విభాగం కొత్త ఈ-పోర్టల్ కూడా తీసుకొచ్చింది. దాన్ని తాజాగా శనివారం మరింత అప్డేట్ చేసింది. అలా అప్డేట్ చేసిన ఆదాయం పన్ను విభాగం వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆవిష్కరించింది. incometaxindia.gov.in వద్ద యూజర్లకు న్యూ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. పూర్తిగా పునరుద్ధరించిన ఐటీ విభాగం వెబ్ సైట్.. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా పలు న్యూ ఫీచర్లు తీసుకొచ్చింది. ఐటీ విభాగం కొత్త వెబ్‌సైట్‌ని సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా ప్రారంభించారు.
మొబైల్ ఫోన్ల రెస్పాన్సివ్ లేఔట్‌తో వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాం అని సీబీడీటీ తెలిపింది. కొత్త ఫీచర్లతో కంటెంట్ కోసం ‘మెగా మెనూ’ తీసుకొచ్చింది.
ఆదాయం పన్ను విభాగం పరిధిలో కొత్త పద్దతులు, ఆదాయం పన్నుకు చెందిన వివిధ చట్టాలు, సెక్షన్లు, నిబంధనలు, పన్ను ఒప్పందాల సమాచారం ఈ వెబ్ సైట్ లో ఉంటుందని తెలిపింది.
యూజర్లు తేలిగ్గా నేవిగేట్ చేసుకోవడానికి వీలుగా ఇన్ కం టాక్స్ యాక్ట్ చట్టాలతో సంబంధిత కంటెంట్ ట్యాగ్ చేశామని వివరించింది. ఆదాయం పన్ను చెల్లింపుదారులకు తేలిగ్గా అర్థమయ్యేలా.. డేట్ అలర్ట్స్, రివర్స్ కౌంట్ డౌన్స్, టూల్ టిప్స్, ఆదాయం పన్ను శాఖ అనుబంధ వెబ్ సైట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
The revamped National website https://t.co/qX8AZ4q1DH serves as a comprehensive repository of tax and other related information.
Some of the features include:
👉It provides access to Direct Tax laws, several other Allied Acts, Rules, Income Tax Circulars and Notifications, all… pic.twitter.com/MXcYqtcYHh— Income Tax India (@IncomeTaxIndia) August 26, 2023
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

