న్యూఢిల్లీ : సిటీ ఇండియా రిటైల్ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంక్ సహా మరో రెండు దిగ్గజ బ్యాంకర్లు ఆసక్తి చూపుతున్నాయి. మరో రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు కూడా రేసులో ఉన్నాయి. ప్రధానంగా కొటక్ మహింద్ర బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్‌లు ఈ డీల్‌లో ప్రధానంగా పోటీ పడతాయని భావిస్తున్నారు.
సిటీ బ్యాంక్ ఇండియా రిటైల్ బిజినెస్ వార్షిక రాబడి రూ 7000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఐదు బ్యాంకులు సిటీ ఇండియా రిటైల్ బిజినెస్ కోసం పోటీపడుతుండగా తదుపరి దశలో షార్ట్‌లిస్ట్‌లో మిగిలే మూడు బ్యాంకర్లతో మెరుగైన డీల్ కోసం సిటీ బ్యాంక్ సంప్రదింపులు జరుపుతుందని తెలిసింది. మరోవైపు సిటీ రిటైల్ బిజినెస్‌ను చేజిక్కించుకోవడం ద్వారా భారత మార్కెట్లో విస్తరణకు ఈ డీల్ ఉపకరిస్తుందని సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంక్ అంచనా వేస్తోంది.