ముంబై, మార్చి 30: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్ష సమావేశాలను ఆరుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలు వచ్చే నెల 6 నుంచి 8 వరకు తొలిసారి భేటీ కాబోతున్నది. వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ప్రతి రెండు నెలలకొకసారి సమావేశం నిర్వహిస్తున్నది. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్‌తోపాటు సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యులు హాజరుకానున్నారు.