ముంబై, జూలై 24: బ్యాంకుల వద్ద నగదు చెల్లింపు సేవలను రిజర్వు బ్యాంక్ మరింత కఠినతరం చేసింది. ఇకపై బ్యాంకులు తమ వద్ద ఖాతాలేని వారికి ఇస్తున్న నగదు విషయంలో ఆ వ్యక్తుల రికార్డులను భద్రపరుచాలని సెంట్రల్ బ్యాంక్ సూచించింది. దేశీయ నగదు లావాదేవీలకు సంబంధించి అక్టోబర్ 2011లో జారీ చేసిన నిబంధనలను సవరించి, ఈ కొత్త నిబంధనలను నవంబర్ 1 నుంచి అమల్లోకి తేనున్నట్లు తెలిపింది.
సవరించిన నిబంధనల ప్రకారం క్యాష్ పే ఔట్ సేవలకు సంబంధించి సొమ్ములు అందుకున్న వ్యక్తి పేరు, చిరునామా వివరాలను బ్యాంకులు భద్రపరుచాలని ఆదేశించింది. అదే విధంగా నగదు డిపాజిట్ విషయంలోనూ సంబంధిత బ్యాంక్, ఆ వ్యక్తుల వివరాలతోపాటు ఫోన్ నంబర్ నమోదు చేయాలని సూచించింది.