హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ ప్రాజెక్టుల ప్రీలాంచ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న సుభిషి ఇన్ఫ్రాకు రెరా నోటీసులు జారీ అయ్యాయి.
15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ సదరు నోటీసులో పేర్కొన్నారు.