హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పరిశ్రమల ఉత్పత్తుల సంస్థ స్పార్కర్ ఫోర్జ్ ప్రతినిధులు టీహబ్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా టీ-హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగీర్దార్తో సమావేశమై వివిధ రంగాలకు సంబంధించిన ఆవిష్కరణలతోపాటు మొబిలిటీ సెక్టార్లో స్పార్కర్ హబ్ ఏర్పాటు చేసే విషయం ప్రధానంగా చర్చించారు.
టీ-హబ్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ హబ్‌పై మరింత లోతుగా చర్చించనున్నట్టు, ఈ రంగానికి సంబంధించిన భాగస్వాములతోనూ సంప్రదింపులు జరుపనున్నారు.