ముంబై, జనవరి 7: ఈ ఏడాది ఐపీవోల సందడి నెలకొననున్నది. ప్రస్తుత సంవత్సరంలో ఐపీవోల ద్వారా గరిష్ఠంగా రూ.2.50 లక్షల కోట్ల వరకు నిధులు సమీకరించవచ్చునని కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్(కేఐబీ) వెల్లడించింది. క్రితం ఏడాది వచ్చిన ఐపీవోల కంటే ఇది 32 శాతం అధికమని తెలిపింది.
వచ్చే ఐపీవోల్లో బిలియన్ డాలర్ల కంటే అధిక విలువైన ఐపీవోలు ఉండటం ఇందుకు కారణమని తెలిపింది. 2025లో రూ.1.89 లక్షల కోట్ల విలువైన వాటాల విక్రయం జరిగింది. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు, ఫాల్లో-ఆన్-ఆఫర్లు, బల్క్ డీల్స్, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్లు మాత్రం 18 శాతం తగ్గి రూ.5.1 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి.