న్యూఢిల్లీ, డిసెంబర్ 26: రెనో ఇండియా తన వాహన ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికం కావడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ పెంపు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఫ్రెంచ్కు చెందిన ఆటోమొబైల్ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో క్విడ్, ట్రైబర్, కైగర్ మాడళ్లు మరింత ప్రియంకాబోతున్నాయి. రూపాయి విలువ పడిపోవడం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాటి ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మెర్సిడెజ్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీలు తమ వాహన ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించాయి
ట్రయంప్ బైకుల ప్రియం
స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ ట్రయంప్ మోటర్‌సైకిల్ మరోసారి వాహన ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. నూతన సంవత్సరంలో అన్ని రకాల బైకుల ధరలను సవరిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. రూపాయి నష్టాల దృష్ట్యా 350 సీసీ మించిన టూవీలర్ల ధరలు పెరుగుతున్నాయి.