టాటా ట్రస్ట్‌లపై ఐటీ ఆదేశాలు కొట్టివేత

న్యూఢిల్లీ: ప్రఖ్యాత రతన్ టాటా 83వ జన్మదినోత్సవం సందర్భంగా మూడు టాటా ట్రస్ట్‌లకు సోమవారం భారీ ఉపశమనం లభించింది. సదరు ట్రస్టులకు ఆదాయం పన్నుశాఖలోని 11 సెక్షన్ కింద ఇచ్చిన పన్ను మినహాయింపులకు ఇన్‌కం టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆమోదం తెలిపింది. మూడు టాటా ట్రస్టులు సమర్పించిన ఐటీ రిటర్న్స్‌ను తిరిగి అంచనా వేస్తామని ఆదాయం పన్నుశాఖ జారీ చేసిన ఆదేశాలను ఐటీఏటీ కొట్టేసింది. ఐటీఏటీ చీఫ్ జస్టిస్ పీపీ భట్, ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్‌లతో కూడిన బెంచ్.. టాటా ట్రస్టులపై సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పత్రాలపై అనుమానం వ్యక్తం చేసింది.
2016 అక్టోబర్ 24వ తేదీన టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు గురయ్యారు. టాటా గ్రూప్ అధినేతగా ఉద్వాసనకు గురైన కొన్ని వారాల్లోనే ఆదాయం పన్నుశాఖకు ఆయన ఆదాయం పన్ను శాఖకు పలు పత్రాలు పంపారు. టాటా గ్రూప్ ట్రస్టులకు ఇచ్చిన ఆదాయం పన్ను మినహాయింపులను తొలగించాలని సైరస్ మిస్త్రీ అభ్యర్థించారు. సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలు సంబంధిత సంస్థ అధికారికంగా ధ్రువీకరించిన పత్రాలు కాదని ఐటీఏటీ అభిప్రాయపడింది. మిస్త్రీ ప్రవర్తన నాగరిక కార్పొరేట్ ప్రపంచంలో వినకూడనిదని కూడా వ్యాఖ్యానించింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.