Reliance | స్విగ్గీ జొమాటోకు పోటీగా రిలయన్స్.. 200 నగరాల్లో డెలివరీ సేవలు!
Reliance | డోర్ డెలివరీలో స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలతో పోటీ పడేందుకు రిలయన్స్ రిటైల్ సిద్ధమైంది.
Reliance | ఈ-కామర్స్ రిటైల్ బిజినెస్లో పోటీ పెరుగుతున్నా కొద్దీ ఆయా సంస్థలు కస్టమర్ల మనస్సు దోచేందుకు వినూత్నంగా ముందుకొస్తున్నాయి. రిలయన్స్ రిటైల్.. వినియోగదారులకు అవసరమైన గ్రాసరీ వస్తువులను ఇంటి వద్ద డెలివరీ చేసేందుకు సిద్ధం అవుతున్నది. ఈ మేరకు నెవీ ముంబైలో ప్రయోగాత్మకంగా సంస్థ జియోమార్ట్ ఎక్స్ప్రెస్ బ్రాండ్ కింద రోజువారీగా సరుకులు విజయవంతంగా పంపిణీ చేసింది. దీంతో ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 200కి పైగా నగరాల్లో గ్రాసరీ వస్తువులను వినియోగదారుల ఇండ్లకే సరఫరా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
గ్రాసరీ ఇన్స్టంట్ డెలివరీలో టాటా సన్స్ ఆధీనంలోని బిగ్ బాస్కెట్, జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. వీటిల్లో కొన్ని సంస్థలు ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ చేసేస్తున్నాయి. జియోమార్ట్ ఎక్స్ప్రెస్ బ్రాండ్ కింద ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లో వస్తువులు డెలివరీ చేయనున్నది రిలయన్స్ రిటైల్. కనిష్ట వస్తువుల ఆర్డర్ వంటి నిబంధన ఉండదు. కానీ రూ.199 లోపు ఆర్డర్లకు రూ.199 డెలివరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రిలయన్స్ రిటైల్ సంస్థ ఆధీనంలోని గ్రాసరీ, పర్సనల్ కేర్, హోం ప్రొడక్ట్స్ మీద మాత్రమే ప్రస్తుతం జియోమార్ట్కు ఆర్డర్ చేయొచ్చు. మున్ముందు ఔషధాలు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్లు జత కలుస్తాయి. గ్రాసరీ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, దుస్తుల విభాగాల్లో రిలయన్స్ రిటైల్దే ఆధిపత్యం. దేశవ్యాప్తంగా అతిపెద్ద రిటైల్ స్టోర్స్ నెట్వర్క్ ఉన్న సంస్థ రిలయన్స్ రిటైల్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

