Reliance-Star India-CCI | రిలయన్స్ అనుబంధ మీడియా సంస్థలో దేశీయ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వాల్ట్డిస్నీ స్టార్ ఇండియా విలీనంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే క్రికెట్ మ్యాచ్ ప్రసార హక్కులు పొందిన రిలయన్స్ అనుబంధ వయాకాం సంస్థలో వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీనం వల్ల ఇతర సంస్థల మధ్య పోటీ వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని సీసీఐ వర్గాలు అనుమానిస్తున్నట్లు తెలిసింది. రెండు సంస్థల విలీన ప్రక్రియపై ఎందుకు దర్యాప్తునకు ఆదేశించకూడదో తెలుపాలని రిలయన్స్, డిస్నీ సంస్థలను సీసీఐ అధికారులు ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై రిలయన్స్, డిస్నీ, సీసీఐ అధికారికంగా స్పందించలేదు. సీసీఐ వర్గాలు మాత్రం ఈ ప్రక్రియ చాలా కాన్ఫిడెన్షియల్ అని చెప్పాయి. ‘సీసీఐకి క్రికెట్ ప్రసార హక్కులే అతిపెద్ద సమస్య’ అని ఆ వర్గాల కథనం.
రిలయన్స్ అనుబంధ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలో వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీనం తర్వాత ఏర్పాటయ్యే సంస్థలో మెజారిటీ వాటా ముకేశ్ అంబానీకే ఉంటుంది. దీనివల్ల కోట్ల డాలర్ల విలువైన క్రికెట్ ప్రసార హక్కులు గల రిలయన్స్.. అడ్వర్టైజర్లపై ఆధిపత్యం, ప్రైసింగ్ పవర్ మీద నియంత్రణ సాధిస్తుందన్న అనుమానాలు ఉన్నాయని సమాచారం. గత ఫిబ్రవరిలో రిలయన్స్, వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీన ఒప్పందం ప్రకటించాయి. విలీనంతో కొత్తగా ఏర్పాటయ్యే అతిపెద్ద వినోద సంస్థ.. 120 టీవీ చానెళ్లు, రెండు స్ట్రీమింగ్ సర్వీసులతో సోనీ, జీ ఎంటర్ టైన్ మెంట్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలతో పోటీ పడుతుంది. దీన్ని సునిశితంగా పరిశీలించాల్సి ఉందని సీసీఐ నిపుణులు చెప్పినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై నెల రోజుల్లో సమాచారం.