న్యూఢిల్లీ, ఆగస్టు 7 : రిలయన్స్ రిటైల్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.33,696 కోట్ల పెట్టుబడులు పెట్టింది. రిటైల్ రంగాన్ని మరింత విస్తరించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి అంతక్రితం ఏడాది పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే 37 శాతం పెరిగినట్టు తన వార్షికపు నివేదికలో వెల్లడించింది. దీంతో రిటైల్ అవుట్లెట్ల సంఖ్య 20 వేలకు చేరువైంది.
రూ.3.30 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న దేశీయ రిటైల్ రంగంలో రిలయన్స్ రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నట్టు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. మరోవైపు, రిలయన్స్ టెలికాం వెంచర్ జియో దూకుడు పెంచింది. 6జీ సేవలు అందించడానికి అవసరమైన టెక్నాలజీపై దృష్టిసారించింది.