న్యూఢిల్లీ, జూలై 3: రిలయన్స్ జియో సోమవారం ఇంటర్నెట్ ఆధారిత జియో భారత్ ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో తెచ్చిన ఈ చౌక 4 జీ మొబైల్ ధర రూ.999. ఈ నెల 7 నుంచి అమ్మకాలు మొదలు కానున్నాయి. రూ.123 నెలసరి ప్లాన్ రిచార్జ్‌తో ఇది పనిచేస్తుంది. 28 రోజుల కాలపరిమితిపై అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ డాటా లభిస్తుంది. కొన్ని జియో యాప్స్, కెమెరా కూడా ఉన్న ఇందులో యూపీఐ పేమెంట్స్‌కు వీలున్నట్టు చెప్తున్నారు.
కాగా, ‘2జీ ముక్త్ భారత్’ విజన్‌లో భాగంగా ఈ కొత్త మొబైల్‌ను ఆవిష్కరించినట్టు ఓ ప్రకటనలో జియో తెలిపింది. దేశంలో ఇప్పటికీ 25 కోట్ల మంది ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫీచర్ ఫోన్లనే ఉపయోగిస్తున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నది. వీరందరి కోసమే ఈ జియో భారత్ ఫోన్‌ను తెచ్చినట్టు జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు. ఇతర నెట్వర్క్ ప్లాన్లతో పోల్చితే 30 శాతం తక్కువ ధరకే 7 రెట్లు ఎక్కువ డాటాను తమ రూ.123 ప్లాన్‌లో అందిస్తున్నట్టు జియో తెలియజేసింది.