Reliance Jio | రేపటి నుంచి నాలుగు నగరాల్లో రిలయన్స్ జియో 5 జీ సేవలు.. వీరే తొలి 5 జీ సేవలు అందుకునే అదృష్టవంతులు
Reliance jio 5G | రిలయన్స్ జియో 5 జీ సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దసరా పండుగను పురస్కరించుకుని 4 నగరాల్లో 5 జీ సేవలను ఎంపికైన కస్టమర్లకు రిలయన్స్ జియో అందించనున్నది.
Reliance Jio | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 జీ సేవలు అందుబాటులోకి రానే వచ్చాయి. అయితే, తొలిసారిగా దసరా పండుగను పురస్కరించుకొని దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5 జీ సేవలు ప్రయోగాత్మకంగా అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమైంది. అయితే, ఈ 5 జీ సేవలను కూడా లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందిస్తుండటం విశేషం.
రిలయన్స్ జియో ఎట్టకేలకు 5జీ సేవలను అందించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. దసరా వేడుకల్లో భాగంగా ప్రయోగాత్మకంగా నాలుగు నగరాల్లోనే టెలికాం కంపెనీ 5జీ ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, వారణాసి నగరాల్లోని జియో వినియోగదారులు బుధవారం నుంచి 5జీ సేవలను యాక్సెస్ చేయనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ తెలిపింది. జియో ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ 5 జీ సేవలు అందుబాటులోకి రావని పేర్కొన్నది.
రిలయన్స్ జియో సంస్థ మన దేశంలో 5జీ సేవలను లాంచ్ చేస్తున్నది. అయితే, కొందరికే ఈ సేవలు తొలి రోజున అందనున్నాయి. ఎంపిక చేసిన వినియోగదారులకు ‘జియో వెల్కం ఆఫర్’ అంటూ ఇన్విటేషన్ పంపించారు. ఈ 5 జీ సేవల బీటా పరీక్ష మాత్రమే కానీ వాణిజ్య ప్రయోగం కాదు. అందుకని రాండమ్గా ఎంపికైన వినియోగదారులకు మాత్రమే 5 జీ సేవలు అందుతాయి. ర్యాండ్మెగా ఎంపికైన వినియోగదారులు ప్రస్తుతం వాడుతున్న హ్యాండ్సెట్, సిమ్ను మార్చాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. ప్రయోగాత్మకంగా అందిస్తున్న తొలి దశలో 1 జీబీపీఎస్ వేగంతో అన్లిమిటెడ్ 5 జీ డాటాను కస్టమర్లు పొందుతారని రిలయన్స్ జియో ధ్రువీకరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

