న్యూఢిల్లీ, జూన్ 2: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహిరంగంగా వర్తకం చేయబడిన టాప్-30 గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చోటు దక్కింది. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న తొలి సంస్థ రిలయన్సే కావడం విశేషం. ‘ట్రెండ్స్-ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’ ఇది ఏఐ టెక్నాలజీతో వేగవంతమైన ప్రపంచ స్వీకరణ, పరివర్తన ప్రభావాన్ని అందుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈ జాబితాలో అమెరికాకు చెందిన గ్లోబల్ టెక్నాలజీ సంస్థలైన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా ప్లాట్‌ఫామ్, టెస్లా, బ్రోడ్‌కామ్ చోటు దక్కించుకున్నాయి. తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీకి తొమ్మిదో స్థానం లభించగా, చైనాకు చెందిన టెన్సెంట్ ఆ తర్వాతి స్థానం దక్కింది. 216 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ 23వ స్థానం వరించింది. గడిచిన 30 ఏండ్లుగా (1995 నుంచి 2025) వరకు ఐదు కంపెనీలు మాత్రమే టాప్-30 అత్యంత విలువైన పబ్లిక్ ట్రేడెడ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలైన- మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సిస్కో, ఐబీఎం, ఏటీఅండ్టీలు చోటు దక్కించుకున్నాయని పేర్కొంది.