అంబులెన్స్‌లకు రిలయన్స్ ఉచిత పెట్రోల్

- తెలుగు రాష్ర్టాలకు హామీ
- తెలంగాణ, ఏపీల్లో రోజూ ఒక్కో వాహనానికి 50 లీటర్ల వరకు పోస్తామని ప్రకటన
హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్‌పై పోరులో తెలుగు రాష్ర్టాలకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపన్న హస్తం అందించింది. తెలంగాణ, ఏపీల్లో కొవిడ్-19 సహాయక చర్యల్లో పాల్గొనే ప్రభుత్వ అత్యవసర సేవలకు చెందిన వాహనాలు, అంబులెన్స్‌లకు ఉచిత ఇంధనాన్ని అందిస్తామంటూ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ బంకుల్లో రోజుకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా 50 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ పోయనున్నారు. జూన్ 30దాకా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగానే ఈ ఉచిత సౌకర్యం లభిస్తుంది.
ద్రవరూప ఆక్సిజన్ సరఫరా
కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్రంగా ఏర్పడిన ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించేందుకూ రిలయన్స్.. రెండు తెలుగు రాష్ర్టాలకు చేయూతనిచ్చింది. తెలంగాణకు 80 టన్నులు, ఏపీకి 80 టన్నుల చొప్పున మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఈ కంటైనర్లను తమ జమ్నగర్ ప్లాంట్ నుంచి హైదరాబాద్, గుంటూరు రైల్వేస్టేషన్లకు రిలయన్స్ ఆదివారమే చేర్చింది. దేశవ్యాప్తంగా వెయ్యి మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను రిలయన్స్ సరఫరా చేస్తున్నది. దేశీయ ఆక్సిజన్ ఉత్పత్తిలో ఇది 11 శాతానికి సమానం. ఈ ఆక్సిజన్ రవాణా కోసం 32 ఐఎస్వో కంటైనర్లను రిలయన్స్ దిగుమతి చేసుకోవడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

