హైదరాబాద్, అక్టోబర్ 1: రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక పండుగ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ను తెచ్చింది. ఈ ఆఫర్లు ఈ నెల 3న ప్రారంభమై 12న ముగియనున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు జరిపిన వారికి 10 శాతం వరకు కంపెనీ ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నది. దీంతోపాటు పేటీఎం ద్వారా కనీసంగా రూ.4,999 చెల్లింపులు జరిపిన వారికి రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనున్నది. ఈ ప్రత్యేక ఆఫర్లు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలకు వర్తించనున్నాయి.