Reliance- Disney | రిలయన్స్ అనుబంధ వయాకాం18, గ్లోబల్ మీడియా సంస్థ వాల్డ్ డిస్నీ భారత్ యూనిట్ విలీన ప్రక్రియ ముగిసింది. రెండు సంస్థల జాయింట్ వెంచర్ విలువ రూ.70,352 కోట్లు ఉంటుంది. జాయింట్ వెంచర్ ఎంఓయూ ప్రకారం ఈ సంస్థ అభివృద్ధికి రిలయన్స్ రూ.11,500 కోట్ల పెట్టుబడి పెడుతుంది. జాయింట్ వెంచర్ సంస్థకు నీతా అంబానీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. జాయింట్ వెంచర్ సంస్థలో రిలయన్స్ 16.34 శాతం, వయాకాం 18 సంస్థకు 46.82, డిస్నీకి మిగతా 36.84 శాతం వాటా ఉంటుంది.
జాయింట్ వెంచర్ కంపెనీ చైర్ పర్సన్ గా నీతా అంబానీ వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడిగా ఉదయ్ శంకర్ ఉంటారు. ఇప్పటికే వయాకాం 18, వాల్ట్ డిస్నీ ఇండియా కంపెనీల విలీనానికి సీసీఐ, ఎన్సీఎల్టీ ఆమోదం కూడా పొందింది. జాయింట్ వెంచర్ సంస్థ 100 టీవీ చానెళ్లు, ఏటా 30 వేల గంటలకు పైగా టీవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్.. కస్టమర్లకు అందిస్తుంది. జియో సినిమా, హాట్ స్టార్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఐదు కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉన్నాయి.