Reliance Store | హైదరాబాద్, ఆగస్టు 3: రిలయన్స్ డిజిటల్.. హైదరాబాద్‌లో మరో స్టోర్‌ను ప్రారంభించింది. హయత్‌నగర్‌లో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ప్రముఖ నటి నభానటేష్ శనివారం ఆరంభించారు. ఈ స్టోర్‌లో అన్ని రకాల డిజిటల్ పరికరాలపై 10 శాతం వరకు తగ్గింపు ధరకే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ 500కి పైగా అంతర్జాతీయ బ్రాండ్లతోపాటు 2 వేలకు పైగా దేశీయ బ్రాండ్ల ఉత్పత్తులను అందిస్తున్నది.