హైదరాబాద్, ఏప్రిల్ 5:రిలయన్స్ డిజిటల్ మరోసారి డిస్కౌంట్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 6 నుంచి 15 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద అగ్రగామి బ్యాంక్ కార్డులపై కస్టమర్లకు 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లేదా ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్లతో కన్జూమర్ డ్యూరబుల్ లోన్లపై రూ.15 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చునని తెలిపింది.
ఈ సందర్భంగా ఎల్జీ ఓఎల్ఈడీ, సామ్సంగ్ నియో క్యూఎల్ఈడీ టీవీలపై 45 శాతం వరకు తగ్గింపు పొందవచ్చునని వెల్లడించింది. అలాగే ఐఫోన్లపై రూ.12 వేల వరకు రాయితీ, రూ.49,999 ప్రారంభ ధరతో ల్యాప్‌టాప్‌లు, రూ.23,900కే అత్యుత్తమ ఐప్యాడ్‌ను అందిస్తున్నది.