హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం రెడ్‌వుడ్ సాఫ్ట్వేర్..హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను కృత్రిమ మేధస్సుకు అంతర్జాతీయ సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్టు కంపెనీ సీఈవో కెవిన్ గ్రీన్ తెలిపారు. ఇంజినీరింగ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, గ్లోబల్ విస్తరణకు ఈ సెంటర్ దోహదం చేయనున్నదన్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 100కి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యను 300కి పెంచుకోనున్నట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ నిపుణులకు కొరత లేదని, ఇక్కడి నుంచి కస్టమర్లకు నూతన టెక్నాలజీ, నాణ్యమైన సేవలు అందించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థకు 150కి పైగా దేశాల్లో 7 వేలకు పైగా కస్టమర్లు ఉన్నారు.