న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా.. కోమెట్ ధరను భారీగా తగ్గించింది. బ్యాటరీ యాస్ ఏ సర్వీసు కింద కొనుగోలు చేసిన వారికి ఈ మాడల్ ధరను రూ.2 లక్షల వరకు కోత పెట్టింది.
దీంతో కోమెట్ ఈవీ ధర రూ.4.99 లక్షలకు తగ్గనున్నది. ఎక్స్‌షోరూం ధర రూ.6.99 లక్షలు. ఈ నూతన ధరలతో కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ.2.5కి తగ్గనున్నదని పేర్కొంది. సింగిల్ చార్జీంగ్‌తో ఈ కారు 230 కిలోమీటర్లు ప్రయాణించనున్నది