న్యూఢిల్లీ, జూలై 31: కీలక రంగాల్లో వృద్ధి మందగించింది. క్రూడాయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో జూన్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 8.2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో 13.1 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అయినప్పటికీ వృద్ధి ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. జనవరి 2023లో నమోదైన 9.7 శాతం తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో కీలక రంగాల్లో వృద్ధి కూడా 13.9 శాతం నుంచి 5.8 శాతానికి జారుకున్నది.