న్యూఢిల్లీ, జూన్ 20: విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్ నిరాశాపరుస్తున్నది. 2023లో దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 43 శాతం తగ్గి 28 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్లో భారత ర్యాంక్ 15వ స్థానానికి పడిపోయిందని ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యూఎన్సీటీఏడీ) తాజాగా విడుదలచేసిన నివేదికలో వెల్లడించింది. 2022లో భారత్లోకి వచ్చిన 48 బిలియన్ డాలర్లతో 8వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.