Redmi Note 14 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ నోట్ 14 ప్రో (Redmi Note 14 Pro) ఫోన్ వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి రానున్నది. కొత్త కెమెరా మాడ్యూల్ తో వస్తోందని సమాచారం. ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంటుంది. ఈ సిరీస్ లో మూడు ఫోన్లూ 1.5కే అమోలెడ్ డిస్ ప్లేతో వస్తున్నాయని తెలుస్తోంది రెడ్మీ నోట్ 14 (Redmi Note 14) సిరీస్ ఫోన్లలో రెడ్మీ నోట్ 14 (Redmi Note 14), రెడ్మీ నోట్ 14 ప్రో (Redmi Note 14 Pro), రెడ్మీ నోట్ 14 ప్రో + (Redmi Note 14 Pro +) ఫోన్లు ఉంటాయి.
రెడ్మీ నోట్ 14 ప్రో (Redmi Note 14 Pro) ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ తో, రెడ్మీ నోట్ 14 ప్రో +(Redmi Note 14 Pro+) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తుందని భావిస్తున్నారు.