Redmi Note 13 5Gseries | ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ నోట్13 5జీ సిరీస్ (Redmi Note 13 5Gseries) ఫోన్లు.. రెడ్మీ నోట్13 5జీ (Redmi Note 13 5G), రెడ్మీ నోట్13ప్రో 5జీ ((Redmi Note 13 Pro5G), రెడ్మీ నోట్13 ప్రో+ 5జీ (Redmi Note 13 Pro+ 5G) ఫోన్లను గురువారం ఆవిష్కరించింది. ఈ ఫోన్లు 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ (6.67-inch full-HD+ AMOLED screen), సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. టాప్ హై ఎండ్ ఫోన్ రెడ్మీ నోట్ 13ప్రో+ 5జీ (Redmi Note 13 Pro+ 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 – ఆల్ట్రా చిప్సెట్, 200-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 వర్షన్‌పై పని చేస్తుంది. మూడు ఓఎస్ అప్గ్రేడ్లు అందిస్తుంది.
రెడ్మీ నోట్ 13 5జీ (Redmi Note 13 5G) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 8జీబీ ర్యామ్ +256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 12 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ ఆర్కిటిక్ వైట్, ప్రిజమ్ గోల్డ్, స్టెల్త్ బ్లాక్ కలర్‌వేస్‌లో లభిస్తుంది.
రెడ్మీ నోట్ 13ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G) ఫోన్ 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.25,999, 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999, 12 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
టాప్ హై ఎండ్ రెడ్మీ నోట్ 13 ప్రో+ 5జీ (Redmi Note 13 Pro+) ఫోన్ 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999, 12జీబీ ర్యామ్ +256జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.33,999, 12జీబీ ర్యామ్ +512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999 పలికింది. ఈ ఫోన్ ఫుష్యన్ బ్లాక్, ఫుష్యన్ పర్పుల్, ఫుష్యన్ వైట్ కలర్‌వేస్‌లో లభిస్తుంది.
రెడ్మీ నోట్13 సిరీస్ ఫోన్లన్నీ ఈ నెల 10 నుంచి ఎంఐ డాట్ కాం, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ ఔట్లెట్లలో లభిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ట్రాన్సాక్షన్లపై రెడ్మీ నోట్ 13 5జీ ఫోన్ కొనుగోలు చేస్తు రూ.1000, రెడ్మీనోట్ 13 ప్రో5జీ, రెడ్ మీ నోట్ 13 ప్రో+ 5జీ ఫోన్ లపై రూ.2000 డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ పొందొచ్చు.
.
రెడ్మీ నోట్13 5జీ సిరీస్ ఫోన్లు.. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూ టూత్ 5.3, జీపీఎస్, a 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. వీటితోపాటు యాక్సెలరో మీటర్, గైరో స్కోప్, యాంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ప్రాగ్జిమిటీ సెన్సర్ తదితర సెన్సర్లు ఉంటాయి.
రెడ్మీనోట్ 13 5జీ ఫోన్ 35 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యటరీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. నాలుగేండ్ల సెక్యూరీ అప్డేట్స్, మూడేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ (ఆండ్రాయిడ్ 12) ఓఎస్ అప్డేట్, అందిస్తుంది.
రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్13 ప్రో+ ఫోన్లు 6.67 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. కానీ కర్వ్డ్, 1.5కే రిజొల్యూషన్ (1220×2,712 పిక్సెల్స్), 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. రెడ్మీ నోట్13 ప్రో 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, రెడ్మీ నోట్ 13 ప్రో+ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 – ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తున్నాయి. రెండింటిలోనూ 12 జీబీ ర్యామ్ కెపాసిటీ ఉంటుంది.
రెడ్మీ నోట్13ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో+ 5జీ ఫోన్ 200 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2.4 ఎఫ్/2.4 అపెర్చర్ అండ్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విత్ ఎఫ్/2.20 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/2.4 అపెర్చర్ కలిగి ఉన్నాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది.
రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 13ప్రో+ 5జీ ఫోన్ వై-ఫై 6, ఇతర ఫోన్లు వై-ఫై 6, వై-ఫై (802.11 ఏసీ) కనెక్టివిటీ కలిగి ఉంటాయి. రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ 5100 ఎంఏహెచ్ కెపాసాటి గల బ్యాటరీ ఉంటుంది. రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ కూడా 67 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ నోట్ 13ప్రో+ 5జీ ఫోన్ 120 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.